"పాడుతా తీయగా" సీజన్ 22 జూన్ 5 వ తేదీ నుంచి ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ న్యూ సిరీస్ కి సంబంధించి లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ కొత్త సీజన్ కి ఒక కొత్త జడ్జి కూడా వచ్చారు. ఈ షో ఇప్పటి వరకు 21 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇకపోతే 2021 నుంచి నిన్నటి సీజన్ 21 వరకు జడ్జెస్ గా సునీత, చంద్రబోస్, విజయ్ ప్రకాష్ వ్యవహరించారు. ఐతే ఈ కొత్త సీజన్ కి విజయ్ ప్రకాష్ ప్లేస్ లోకి సీనియర్ సింగర్ శ్రీనివాస మూర్తి వచ్చారు. ఆయన స్టేజి మీదకు రాగానే ఎస్పీ చరణ్ ని హగ్ చేసుకున్నారు. "మీకు నాన్నగారికి మధ్య అనుబంధం ఎప్పటి నుంచి ఎలా మొదలయ్యింది" అని చరణ్ అడిగారు. "ఈరోజు నేను ఇలా ఉండడానికి కర్త, కర్మ, క్రియ బాలు గారే.." అని చెప్పారు.
ఇక ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ లో 12 మంది కంటెస్టెంట్స్ వచ్చి పెర్ఫార్మ్ చేశారు. ఇటీవల పూర్తైన సీజన్ 21 పాడుతా తీయగా టైటిల్ విన్ అయ్యింది హైదరాబాద్ నుంచి శృతి. ఈమె 5 లక్షల క్యాష్ ప్రైజ్ గెలుచుకుంది, సెకండ్ ప్లేస్ లో కృష్ణ చైతన్య 3 లక్షలు, రన్నరప్ గా పవిత్ర 2 లక్షల క్యాష్ ని గెలుచుకున్నారు. ఈ పాడుతా తీయగా షో నుంచి ఎంతో మంది సింగర్స్ గా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. సింగింగ్ రియాలిటీ షోస్ లో ఇప్పటి వరకు దీనికి మించిన షో మరొకటి రాలేదు. బాలసుబ్రమణ్యం గారి తర్వాత ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఈ షో బాధ్యతలను తీసుకుని నడిపిస్తున్నారు..ఆయన "సీతారామం" సినిమాలో పాడిన పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. అలాగే అంజలి నటించిన వెబ్ సిరీస్ "ఫాల్" లో సోనియా అగర్వాల్ తో కలిసి చరణ్ నటించారు..చరణ్ వాళ్ళ నాన్న బాటలోనే యాక్టర్ గా, సింగర్ గా, హోస్ట్ గా దూసుకెళ్తున్నారు.